డ్రగ్స్‌‌ కేసులో  ఈ వారంలో నోటీసులు!

V6 Velugu Posted on Apr 06, 2021

హైదరాబాద్, వెలుగు:రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్‌‌ కేసులో కర్నాటక పోలీసులు సీరియస్‌‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసుల కోర్డినేషన్‌‌తో డ్రగ్స్‌‌ దందా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారంలో నలుగురు ప్రజాప్రతినిధులు,8 మంది రియల్టర్స్‌‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌, మాదాపూర్‌‌‌‌, కొంపల్లి సహా మరో ఐదు ప్రాంతాల్లో జరిగిన పార్టీలు,ఈవెంట్ల వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే డ్రగ్‌‌ పెడ్లర్లతో కాంటాక్ట్‌‌లో ఉన్న రియల్టర్స్, ప్రజాప్రతినిధుల కాల్‌‌డేటాను కర్నాటక పోలీసులు కలెక్ట్ చేసినట్టు తెలిసింది.

నాలుగు కేసుల్లో 9 మంది అరెస్టు

బెంగళూరులోని కాడుగొండనహళ్లి పీఎస్‌‌లో ఫిబ్రవరి 27, 28న మూడు కేసులు రిజిస్టర్‌‌‌‌ అయ్యాయి. మార్చి 5న గోవిందపుర పీఎస్‌‌లో మరో డ్రగ్స్‌‌ కేస్ రిజిస్టరైంది. నాలుగు కేసులను కర్నాటక సెంట్రల్‌‌ క్రైమ్ బ్రాంచ్‌‌ దర్యాప్తు  చేస్తోంది.ఈ కేసుల్లో ముగ్గురు నైజీరియన్లు హారిసన్‌‌, జానాన్సోన్, లోకండోతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. వీకెండ్‌‌ పార్టీలు నిర్వహించే ఈవెంట్ మేనేజర్లు, జానాన్సోన్‌‌ ‘‘వన్‌‌లవ్‌‌’’ నెట్‌‌వర్క్‌‌లోని డ్రగ్స్‌‌ పెడ్లర్స్‌‌ వివరాలు రాబట్టింది. కన్నడ బిగ్‌‌బాస్‌‌ 4 కంటెస్టెంట్‌‌ మస్తాన్‌‌చంద్ర, రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారి శంకర్‌‌‌‌గౌడ స్టేట్‌‌మెంట్‌‌తో డ్రగ్‌‌ పెడ్లర్‌‌‌‌ కోసం సెర్చ్ చేస్తోంది. 

కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీలు, కాల్‌‌డేటా

శంకర్‌‌‌‌గౌడ నిర్వహించిన ఈవెంట్స్‌‌, సీసీటీవీ ఫుటేజ్‌‌లు, కాల్‌‌డేటాతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మార్చి 5న రిజిస్టరైన కేసులో రతన్‌‌రెడ్డి, కలహర్‌‌‌‌రెడ్డిలు విచారణకు అటెండ్‌‌ కాలేదని సమాచారం. ఇదే కేసులో తెలుగు సినీ యాక్టర్‌‌‌‌ తనీశ్, బెంగళూరుకు చెందిన మస్తాన్‌‌చంద్రలను కర్నాటక పోలీసులు విచారించారు. తనీశ్‌‌ను సాక్షిగా మాత్రమే ట్రీట్‌‌ చేసినట్లు తెలిసింది. నోటీసులకు స్పందించని రియల్టర్లు, ఎమ్మెల్యేలపై లీగల్‌‌ యాక్షన్‌‌ తీసుకునేందుకు కర్నాటక పోలీసులు రెడీ అవుతున్నట్టు సమాచారం.

Tagged Telangana, MLA, TRS MLA, Drugs Case, Bangalore

Latest Videos

Subscribe Now

More News