
హైదరాబాద్- కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో వైద్య సిబ్బందిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ క్రమంలోనే సోమవారం కాంట్రాక్ట్ పద్దతిలో 50 వేల డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల నియమానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. వారి వేతనాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టుకు నెలకు రూ.లక్ష,ఎంబీబీఎస్ చేసిన వారికి రూ.40 వేలు, ఆయూష్ డాక్టర్లకు రూ.35 వేలు, స్టాఫ్ నర్సులకు రూ.23 వేలు, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17 వేల జీతాలు ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది వైద్యారోగ్య శాఖ. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్ సైట్https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. చూడవచ్చు.