కొలువుల పండుగ.. పోలీస్‌‌‌‌‌‌‌‌, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్లో 7,437 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌..

కొలువుల పండుగ.. పోలీస్‌‌‌‌‌‌‌‌, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్లో 7,437 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌..
  • యూనిఫామ్​సర్వీస్లో త్వరలో నోటిఫికేషన్‌.. 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీసు శాఖతోపాటు అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్  విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందన్నారు. స్థానిక కేడర్ వారీగా పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్లు తదితర వివరాలను హోంశాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు  ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వివరాల సేకరణ పూర్తికాగానే నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను విభాగాల వారీగా వెల్లడించారు.

పోలీస్‌‌ శాఖలో పోస్టులు

  • సబ్‌‌ ఇన్‌‌స్పెక్టర్ (సివిల్)    148
  • రిజర్వ్‌‌ ఎస్‌‌ఐ (ఏఆర్)    14
  • రిజర్వ్‌‌ ఎస్‌‌ఐ (టీజీఎస్పీ)    12
  • రిజర్వ్‌‌ ఎస్‌‌ఐ (ఎస్‌‌ఏఆర్‌‌సీపీఎల్)    3
  • అసిస్టెంట్ సబ్‌‌ ఇన్‌‌స్పెక్టర్ 
  • (ఫింగర్‌‌ ఫ్రింట్‌‌ బ్యూరో )    23
  • పోలీసు కానిస్టేబుల్ (సివిల్)    3,697
  • కానిస్టేబుల్ (ఏఆర్)    1,052
  • కానిస్టేబుల్ (ఎస్‌‌ఏఆర్‌‌సీపీఎల్)    24
  • కానిస్టేబుల్ (డ్రైవర్)    20
  • కానిస్టేబుల్ (మెకానిక్)    7 

అగ్నిమాపక శాఖలో పోస్టులు

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్     39
  • ఫైర్ ఫైటర్     751

జైళ్ల శాఖలో..

  • డిప్యూటీ జైలర్ (పురుషులు)     14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు)    01  
  • వార్డర్ (పురుషులు)    196
  • వార్డర్ (మహిళలు)    12 
  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌
  • సబ్‌‌ ఇన్‌‌స్పెక్టర్    44
  • కానిస్టేబుల్    1,380