SBI లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

SBI లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

ఏజ్ లిమిట్: అక్టోబర్ 31 నాటికి 20 -28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అలాగే రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 125 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 100 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టి(మంగళవారం,జూలై-6) ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరితేదీ జూలై 26.
ఎంపిక ప్రక్రియ: ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు sbi.co.in వెబ్‏సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒక స్టేట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు తొలగిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఆగస్టు 2021లో ఉంటుంది. స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
వెబ్ సైట్: https://www.sbi.co.in/