ఖిలా వరంగల్ కోటలో ఆదివారం సాయంత్రం 5,001 మంది కళాకారిణులు నృత్య ప్రదర్శన చేశారు. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్’ నమోదు కోసం భారీ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
