రాజ్యసభలో పెరిగిన ఎన్డీయే కూటమి బలం.. రెండింట మూడొంతుల మెజారిటి!

రాజ్యసభలో పెరిగిన ఎన్డీయే కూటమి బలం.. రెండింట మూడొంతుల మెజారిటి!

న్యూఢిల్లీ: కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించడానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీయేకు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చెలరేగిన తిరుగుబాటు బలాన్ని చేకూర్చనుంది. ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల దశ ఎన్డీయేను ఆ ‘మూడింట రెండొంతుల’ మార్కుకు చేరువ చేస్తున్నది.

 ప్రస్తుతం 148 మంది ఎంపీల బలం ఉన్న ఎన్డీయే, ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్, మిజోరాంలలో స్వతంత్ర అభ్యర్థుల స్థానాలను గెలుచుకోవడం వల్ల రాజ్యసభలో అదనంగా 3 స్థానాలను దక్కించుకుంటుంది. ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో వాటిని  దక్కించుకుంటే ఎన్డీయే బలం 154కి చేరుతుంది. 

ఇది ఎగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి అవసరమైన సంఖ్య కంటే తొమ్మిది తక్కువ. ఎగువ సభలో మరికొంతమంది టీఎంసీ ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉన్నందున, ఎన్డీయే 163 స్థానాల సంఖ్యను చేరుకోవచ్చు. అయితే, లోక్‌‌‌‌సభలో మాత్రం రెండొంతుల మెజారిటీ సాధించలేదు.