రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణ శాసన మండలిలోని రెండు ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఈరోజు(జనవరి 11) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.

జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జనవరి 19న నామినేష్ల పరిశీలన, 22 వరకు విత్ డ్రాకు గడువు ఇచ్చింది. జనవరి 29న పోలింగ్‌ ఉంటుంది. అదేరోజున సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

వేర్వేరు ఉప ఎన్నికలు కావడంతో రెండు MLCలు.. కాంగ్రెస్ కే దక్కనున్నాయి. అయితే.. ఐతే ఎమ్మెల్సీ పదవుల కోసం హస్తం పార్టీలో చాలా మందే రేసులో ఉన్నారు. 

కాగా, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఉపఎన్నికలు నిర్వహిస్తున్నది.