ఇంకెంత మంది చావాలి.. ఇంకెప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు

ఇంకెంత మంది చావాలి.. ఇంకెప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు
  • కొత్త జిల్లాలు, డివిజన్లు, కలెక్టరేట్లు వచ్చాయి.. ఉద్యోగాలు మాత్రం రావట్లే
  • బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్: చదువులు పూర్తయి ఉద్యోగాలు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ.. నిరాశ నిస్పృహకు గురై తీవ్ర మనోవేదనతో నిరుద్యోగులు ఇంకెంత మంది చావాలి..? కొత్త ఉద్యోగాలకు ఇంకెప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు..? అని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు, డివిజన్లు, కలెక్టరేట్లు వచ్చాయి.. ఉద్యోగాలు మాత్రం ఎందుకు రావట్లేదని ఆయన నిలదీశారు. ఇవాళ  హైదరాబాద్ లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో TSPSC ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఒక్క చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఆరుగురు ఐఏఎస్ లు చేసే పని ఒక్కడే చేస్తున్నాడు... ఏ ఆఫీస్ లో చూసిన ఇదే పద్ధతి కొనసాగుతుందన్నారు. TSPSC రాజ్యాంగ బద్ద సంస్థ...కానీ రబ్బరు స్టాంప్ అయిపోయింది.. పోస్టుఆఫీస్ లాగా తయారు అయిందని ఆయన ఆరోపించారు.

‘11 ఏండ్ల నుండి రాష్ట్రములో గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, 6 ఏండ్ల నుండి గ్రూప్ 2కు నోటిఫికేషన్ లేదు... ఉద్యోగాలు రావనే నిరాశతో నిరుద్యోగులు చనిపోతున్నారు.. విద్యా వాలంటీర్లను నిర్వీర్యం చేస్తున్నారు..పాఠశాలల్లో పాఠాలు చెప్పే పంతుళ్లు లేరు... నిరుద్యోగ సమస్య అధికం అవుతోంది...30 ఏండ్లు, 40 ఏండ్లు వచ్చినా కూడా ఉద్యోగాలు లేక జులాయిలుల్లా రోడ్ల మీద తిరుగుతున్నారు..’అని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నోటిఫికెషన్స్ వేయాలి... లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి:

ఎంప్లాయ్‎కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్

పూణెలో బర్డ్‌ఫ్లూ కలకలం

సన్నీ లియోనీ పాన్ నెంబర్ తో లోన్ తీసుకుండు