వీళ్లేం మనుషులురా బాబూ.. షూలో కూల్ డ్రింక్ పోసుకుని తాగుతారా..

వీళ్లేం మనుషులురా బాబూ.. షూలో కూల్ డ్రింక్ పోసుకుని తాగుతారా..

రీల్స్ కోసం యువత చేస్తున్న పిచ్చి చేస్టలు ఎక్కువవుతున్నాయి. షూలో కూల్ డ్రింక్ పోసుకుని తాగుతున్నారు. గతంలో ఢిల్లీ మెట్రోలో ఒక అమ్మాయి నోట్లో కూల్ డ్రింక్ పోసుకొని.. యువకుడి నోట్లో కి ఊమ్మి వేస్తున్న వీడియో హల్ చల్ చేసింది.. ఇలాంటిదే మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వైరల్ కావాలనే ఉద్దేశంతో ఈ యువత యాక్.. అనిపించేలా షూలో కూల్ డ్రింగ్ పోసుకొని తాగుతూ రీల్స్ చేశారు. సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

ఈ వీడియలో బాయ్ ఫ్రెండ్ తన షూస్ లో ఒకదాన్ని చేతిలో పట్టుకోవడం, అతని గర్ల్ ఫ్రెండ్ కూల్ డ్రింక్ ను అందులో పోయడం.. వారు షూ నుంచి  స్ట్రా వేసి థమ్స్ అప్ తాగుతున్నట్లు కనిపిస్తుంది. స్ట్రా వేసి తాగుతుండటంతో షూలోపల కప్పు పెట్టి ఇలా చేశారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు నెటిజన్లు. 

గతంలో ఢిల్లీ మెట్రోలో ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లోకి కూల్ డ్రింక్ ఉమ్మివేస్తూ అసహ్యంగా రీల్స్ చేసిన అదే జంట ఇప్పుడు షూలో కూల్ డ్రింగ్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కొందరు అసహ్యించుకుంటున్నారు.. మరికొందరు ఇటువంటిది కొత్తేమి కాదు.. క్రికెటర్లు సైతం ఇలా చేశారు.. అవి కూడా వైరల్ అయ్యాయి అంటూ వారిని సమర్దిస్తున్నారు. 

షూ నుంచి తాగడం అనుకున్నంత విచిత్రం ఏమి కాదు.. 

షూ నుంచి తాగడం అనేది విచిత్ర మైన విషయం ఏమి కాదంటున్నారు నెటిజన్లు.. ఎందుకంటే 2021లో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు తమ ప్రపంచ కప్ విజయాన్ని సాధించినప్పుడు బూటులో తాగుతూ సంబరాలు చేసుకుంటున్న వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ క్లిప్ లు 2023లో చివరి దశలో ఆన్ లైన్ లో మళ్లీ కనిపించాయి. ఏదీ ఏమైనా ఇలాంటి అసభ్యకర చర్యలను కొన్ని సంప్రదాయాలు, సంస్కృతులు సహించవు.వీటికి శిక్ష కూడా ఉంటుందంటున్నారు నెటిజన్లు.