జొకో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ విక్టరీ

జొకో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ విక్టరీ

న్యూయార్క్‌‌‌‌: సెర్బియా టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌.. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌లో బోణీ చేశాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో రెండో సీడ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 6–0, 6–2, 6–3తో అలెగ్జాండర్‌‌‌‌ ముల్లర్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌)పై గెలిచాడు. తాజా విజయంతో నొవాక్​ మళ్లీ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను చేరుకున్నాడు. ఇప్పటికే 389 వారాల పాటు నంబర్‌‌‌‌వన్‌‌‌‌గా కొనసాగిన సెర్బియన్‌‌‌‌ స్టార్‌‌‌‌ దానిని 390కు పెంచుకున్నాడు. 2011లో టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌కు చేరిన జొకోవిచ్‌‌‌‌ అత్యధికంగా 122 వారాల పాటు అదే ప్లేస్‌‌‌‌లో కొనసాగాడు. 

గంటా 35 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌ 6, ముల్లర్‌‌‌‌ 4 ఏస్‌‌‌‌లు కొట్టారు. ఇద్దరు చెరో ఐదు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేశారు. జొకోవిచ్‌‌‌‌ 13 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో 8 కాపాడుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో సిట్సిపాస్‌‌‌‌ (గ్రీస్‌‌‌‌) 6–2, 6–3, 6–4తో రోనిక్‌‌‌‌ (కెనడా)పై, రూడ్‌‌‌‌ (నార్వే) 7–6 (7/5), 3–6, 6–4, 7–6 (7/5)తో నవా (అమెరికా)పై గెలిచారు. అయితే, కార్బెల్లా బియాన్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌) 6–3, 4–6, 6–3, 6–2తో నాలుగోసీడ్‌‌‌‌ రూనే (డెన్మార్క్‌‌‌‌)కు షాకిచ్చాడు.  మరోవైపు  విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో లోకల్​ స్టార్​ కోకో గాఫ్‌‌‌‌ (అమెరికా) 3–6, 6–2, 6–4తో లారా సిగ్మండ్‌‌‌‌ (జర్మనీ)పై గెలిచింది. ఇతర మ్యాచ్​ల్లో రిబకినా (కజకిస్తాన్‌‌‌‌) 6–2, 6–1తో కొస్తుయుక్‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌)పై, క్విటోవా (చెక్‌‌‌‌) 6–1, 7–6 (7/5)తో బుక్సా (స్పెయిన్‌‌‌‌)పై, వోజ్నియాకి (డెన్మార్క్‌‌‌‌) 6–3, 6–2తో ప్రొజోరోవాపై గెలిచి ముందంజ వేశారు.