హైదరాబాద్సిటీ, వెలుగు: కోకాపేట భూముల వేలానికి సంబంధించి ఈ నెల17న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. రాయదుర్గంలోని టీ–హబ్లో ఉదయం 11 గంట నుంచి జరిగే ఈ ప్రీబిడ్ సమావేశానికి మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, బిల్డర్లు, డెవలపర్లు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోకాపేట నియో పోలిస్లేఅవుట్లోని ఆరు ప్లాట్లు, గోల్డెన్ మైల్ లేఅవుట్ లో ఒక ప్లాట్, మూసాపేటలో రెండు ప్లాట్లను హెచ్ఎండీఏ ఈ నెల 24 నుంచి వేలం వేయనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అధికారులు ప్లాట్ల వివరాలు వెల్లడిస్తారు. అలాగే వాటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో వివరిస్తారు.
