అతడి బౌలింగ్ లో పస తగ్గలేదు

అతడి బౌలింగ్ లో పస తగ్గలేదు

చెన్నై: వెన్ను గాయంతో కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనంలో జోరు చూపిస్తున్నాడు. తన బ్యాట్‌లో ఏమాత్రం పదును తగ్గలేదని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో నిరూపించాడు. అయితే మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు. పాండ్యా బౌలింగ్‌లో పస తగ్గలేదన్నాడు.

'వెన్ను గాయం తర్వాత పేస్ తగ్గడం మామూలే. అయితే అతడు తన దూకుడు స్వభావాన్ని కోల్పోలేదు. పేస్ బౌలర్‌కు ఇది చాలా కీలకం. ఇప్పుడు అతడు బౌన్సర్లు సంధించొచ్చు. అలాగే బంతిని ఇరు వైపులా స్వింగ్ చేస్తూ, వేగాన్ని పెంచడం మీద అతడు శ్రమించాలి. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్ లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు. కానీ ఈ సీజన్‌లో ఆల్రౌండ్ స్కిల్స్ తో అతడు తప్పక ఆకట్టుకుంటాడు' అని బాండ్ చెప్పాడు.

మరిన్ని వార్తలు