Telegram New features: వాట్సాప్కు పోటీగా టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్

Telegram New features: వాట్సాప్కు పోటీగా టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్

యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేయడంలో టెలిగ్రామ్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ లేటెస్ట్ ఫీచర్స్ రిలీజ్ చేసింది. ట్రాన్స్‌లేటింగ్‌ ఎంటైర్‌ చాట్స్‌ అనే కొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు మొత్తం చాటింగ్ ను ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్చర్, ఎమోజీ కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా ఈ అప్ డేట్ తో అందుబాటులోకి తెచ్చింది. టెలిగ్రామ్‌లో పైన ఉన్న ట్రాన్స్‌లేటింగ్‌ ఎంటైర్‌ చాట్స్‌ బటన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. అయితే, ప్రస్తుతం ట్రాన్స్ లేషన్ ఆప్షన్ ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.