హైదరాబాద్ మెట్రో రైల్: వాట్సాప్‌లో సలహాలు, ఫిర్యాదులు ఇవ్వండి

హైదరాబాద్ మెట్రో రైల్: వాట్సాప్‌లో సలహాలు, ఫిర్యాదులు ఇవ్వండి
  • సూచనలు, ఫిర్యాదులు ఫీడ్‌బ్యాక్ కోసం వాట్సాప్ నంబర్

హైదరాబాద్ మెట్రో రైల్.. భాగ్య నగరంలో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం అందిస్తోంది. నిమిషాల్లో గమ్య స్థానాలకు చేరుస్తోంది. రోజు లక్ష మంది పైగా ప్రయాణికులను సర్వీస్ అందిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మెట్రో సర్వీసుల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచి.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కోచ్‌లు పెట్టి సౌకర్యంగా ప్రయాణించేలా వారికి సాయపడుతోంది. మెట్రోలో ఎవరైనా ఎవైనా వస్తువులు మరిచిపోయినా, పోగొట్టుకున్నా 040-2333-2555.నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి, వాటిని సీసీ కెమెరా ఫుటేజీ ఆదారంగా తిరిగి పొందే అవకాశం కల్పిస్తోంది.

ప్రయాణికుల కోసం వాట్సాప్‌లోకి మెట్రో

ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రతి అప్‌డేట్ వాట్సాప్‌లోనే తెలుసుకుంటున్నారు జనం. ఫ్యామిలీ, ఫ్రెండ్.. ఇలా రకరకాల గ్రూప్స్ క్రియేట్ చేసుకుని చాట్ చేసుకుంటున్నారు. దీంతో తన ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు హైదరాబాద్ మెట్రో వాట్సాప్ నంబర్ ప్రారంభించింది. 79959 99533 నంబరు ద్వారా వాట్సాప్‌లో మెట్రోను పలికరించొచ్చు. ప్రయాణికులు మెట్రో సర్వీసులపై తమ ఫీడ్‌బ్యాక్‌ను తెలియజేయవచ్చు. అలాగే సేవలను ఎలా మెరుగుపరుచుకోవచ్చన్న దానిపై సలహాలు కూడా ఇవ్వవచ్చు. సమస్యలపై ఫిర్యాదులు కూడా చేయొచ్చు. కాగా, ఇది వరకే మెట్రో ట్రైన్‌లో లేడీస్ కోచ్‌లోకి మగవాళ్లు వచ్చినా, వ‌ృద్ధుల సీట్లలో ఇతరులు కూర్చున్నా ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ కంట్టైంట్ నంబరు(+91 7032224242)ను ఇచ్చింది.

ఫీడ్‌బ్యాక్/సలహాలు ఇలా..

  • ఒక ట్రైన్ కు సంబంధించి సలహాలు, ఫిర్యాదుల కోసం వాట్సాప్‌లో ఒక ప్రత్యేకమైన ఫార్మాట్ పెట్టింది మెట్రో.
  • 79959 99533 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ట్రైన్ నంబర్.XX అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. మీ మెజేస్‌ను టైప్ చేసి పంపాలి.
  • ఉదాహరణకు మీరు ప్రయాణిస్తున్న టైన్ నంబర్ 15 అయితే..  ట్రైన్ నెం.15 ట్రైన్ సమయ పాలన బాగుంది లేదా ట్రైన్‌లో మరేదైనా సమస్యను కూడా ప్రస్తావించవచ్చు.
  • అలాగే స్టేషన్, ప్లాట్ ఫాం, సెక్యూరిటీ సహా ఇతర కంప్లైంట్స్‌ను ఏ ఫార్మాట్ తో పని లేకుండా నేరుగా వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు.
మెట్రో రైలులోని కోచ్‌లలో ఆ ట్రైన్ నంబరుతో ఫీడ్ బ్యాక్ ఎలా పంపాలనేది తెలుపుతూ ఇలాంటి స్టిక్కర్లను అంటించారు మెట్రో అధికారులు.