కోట్లాది యువతకు ఎన్‌ఆర్‌‌ఏ వరం: మోడీ

కోట్లాది యువతకు ఎన్‌ఆర్‌‌ఏ వరం: మోడీ

న్యూఢిల్లీ: కామన్ ఎంట్రన్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌) నిర్వహణకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌‌ఏ) అనే మల్టీ ఏజెన్సీ బాడీని కేంద్ర సర్కార్ ఏర్పాటు చేసింది. సెట్‌ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌ కోసం పోటీపడే అభ్యర్థులను స్క్రీనింగ్ చేస్తారు. సెట్ నిర్వహణ బాధ్యతలు ఎన్‌ఆర్‌‌ఏ చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌‌ఏ ఏర్పాటు చేయాలన్న కేబినెట్ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు.

‘కోట్లాది యువతకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ వరం అవుతుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌తో బహుళ పరీక్షల నిర్వహణ భారాన్ని ఎన్‌ఆర్‌‌ఏ తగ్గిస్తుంది. అలాగే, అతి విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుంది. పారదర్శకతకూ ఇది ఊతమిస్తుంది’ అని మోడీ ట్వీట్ చేశారు. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్రం రూ.1,517 కోట్లు విడుదల చేసింది. మూడేళ్ల కాల పరిమితిలో ఈ డబ్బులను వినియోగిస్తారు.