ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఇండియన్ రెస్టారెంట్ కాంక్లేవ్ 2022

ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఇండియన్ రెస్టారెంట్ కాంక్లేవ్ 2022

హైదరాబాద్, వెలుగు:  నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​ఆర్​ఏఐ) హైదరాబాద్ చాప్టర్, హెచ్​ఐసీసీలో ‘ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఇండియన్ రెస్టారెంట్ కాంక్లేవ్ 2022’ను  మంగళవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్​ఆర్​ఏఐ తెలంగాణ ప్రభుత్వ వాణిజ్యం & పరిశ్రమల శాఖతో కలసి టీఎస్​ ఐపాస్ ద్వారా ఫుడ్ సర్వీస్ సెక్టార్ కోసం భారతదేశంలోనే తొలిసారిగా సింగిల్ విండో అప్లికేషన్‌‌ను ఆవిష్కరించింది. ఈ పోర్టల్ సింగిల్ విండో   లైసెన్స్‌‌లను రెగ్యులేట్​ చేస్తుంది. వేగంగా ప్రాసెసింగ్‌‌ ఉంటుంది.   పోర్టల్ కేవలం రెస్టారెంట్‌‌లు, బార్‌‌లు  ఫుడ్ అవుట్‌‌లెట్‌‌లకు మాత్రమే కాకుండా కియోస్క్‌‌లు, బేకరీలు, కేఫ్‌‌లు  క్లౌడ్ కిచెన్‌‌లకు కూడా టీఎస్​ ఐపాస్ ​వర్తిస్తుంది. రెస్టారెంట్ పరిశ్రమకు చెందిన వాళ్లతోపాటు విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు,  బ్యూరోక్రాట్‌‌లతో సహా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు కాన్​క్లేవ్​కు వచ్చారు.

ఈ కార్యక్రమంలో  -బార్బెక్యూ నేషన్ సీఈఓ రాహుల్ అగర్వాల్, మెక్​ డొనాల్డ్స్ సీఈఓ నిషిత్ పాండే,  ఆలివ్ బార్ & కిచెన్ గ్రూప్ ఎండీ ఏడీ సింగ్, ఆల్మండ్ హౌస్ యజమాని  చైతన్య ముప్పాల వంటి ప్రముఖులు చర్చలు జరిపారు.  ఇన్ఫర్మేటివ్ ప్యానెల్ డిస్కషన్లకు, వర్క్‌‌షాప్‌‌లకూ ఈ కార్యక్రమం వేదికయింది. రియల్ ఎస్టేట్ ట్రెండ్‌‌ల గురించి, విజయవంతమైన క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని సృష్టించడంపై 50 మందికి పైగా మాట్లాడారు. కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చీఫ్​ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 500 కోట్ల కమిట్‌‌మెంట్ లెటర్లపై సంతకాలు జరగడంపై హర్షం ప్రకటించారు.