నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఎన్ఆర్​ఐ సాయం

నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఎన్ఆర్​ఐ సాయం

కాగజ్ నగర్, వెలుగు : ఎంబీబీఎస్​ సీటు సాధించి ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న నిరుపేద విద్యార్థికి ఓ ఎన్ఆర్​ఐ బాసటగా నిలిచారు. బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లి గ్రామానికి చెందిన బోర్కుట్ రామయ్య ,మీరాబాయి దంపతుల కుమారుడు అనిల్​కు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన అతడి పరిస్థితిని గ్రామానికి చెందిన స్వేరోల ద్వారా అమెరికాలో ఉండే ఎన్ఆర్​ఐ జాడె చంద్రశేఖర్ తెలుసుకున్నారు.  

ఆ విద్యార్థికి అండగా నిలిచారు. చంద్రశేఖర్ మంగళవారం రూ.25 వేల నగదు పంపగా స్వేరో నాయకులు డొంగ్రే సురేశ్ సోనులే గణపతి, ఇగురపు లక్ష్మణ్, అంజయ్య మరికొందరు అనిల్ తల్లిదండ్రులను కలిసి ఆ నగదును వారికి అందజేశారు.

బాల్య మిత్రునికి బాసటగా..

దండేపల్లి : బాల్య మిత్రుని కుటుంబానికి మేమున్నామంటూ ఆర్థిక సాయం అందించి బాసటగా నిలిచారు తోటి మిత్రులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన కుష్ణపల్లి రమేశ్ భార్య గంగ జమున దీర్ఘకాలిక వ్యాధితో ఇటీవల చనిపోయింది. నిరుపేద కుటుంబం, చిన్న పిల్లలతో సతమతమవుతున్న రమేశ్​కు 2000-2001 పదో తరగతి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు.

తల్లిని కోల్పోయిన చిన్నారి లాస్య పేరు మీద మంగళవారం రూ.21వేలు ఫిక్స్​డ్ డిపాజిట్ చేయించారు. పిల్లల భవిష్యత్తు, చదువులకు కూడా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో నాటి విద్యార్థులు గొర్ల సుధాకర్, దాసరి శ్రీనివాస్, కాండ్రపు శ్రీనివాస్, పింగిలి మల్లేశ్, పనాస రమేశ్, ముత్యం నాగవర్మ, అక్కల రాజన్న తదితరులు పాల్గొన్నారు.