
గొల్లపల్లి, వెలుగు : దుబాయ్ బ్యాంకు అకౌంట్‌లో ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ ఆరోపణలపై కేసులో చిక్కుకున్న తన భర్తను ఇంటికి రప్పించాలని కోరుతూ ఓ మహిళ హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. బాధితుల వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.
అక్కడ అతని పేరు మీద అకౌంట్ తీసుకోగా.. దానికి సంబంధి లోన్ ఉందని అక్రమంగా కేసు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించారని, భార్య సరిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను ఎలాగైనా విడిపించాలని ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డికి ఫిర్యాదు చేసింది.