NRI News: ఎడాపెడా రియల్టీ ప్రాపర్టీలు కొంటున్న ఎన్ఆర్ఐలు.. షాకింగ్ సీక్రెట్ ఇదే!

NRI News: ఎడాపెడా రియల్టీ ప్రాపర్టీలు కొంటున్న ఎన్ఆర్ఐలు.. షాకింగ్ సీక్రెట్ ఇదే!

NRI Realty Shopping: ప్రస్తుతం భారతదేశంలోని రియల్టీ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అదేటంటే విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్లు, ఫ్లా్ట్లు కొనుగోలు చేస్తున్నట్లు డేటా చెబుతోంది. అయితే ఈ ట్రెండ్ గతంలో ఎన్నడూ చుడనంత వేగంగా దూసుకుపోతోందని గమనించబడింది. ఒక్కసారిగా ఎన్ఆర్ఐలు రియల్టీ మార్కెట్లోకి దూకటం వెనకు కారణం ఏంటనే అనుమానం సామాన్య ప్రజలను వెంటాడుతోంది.

వాస్తవానికి మారిన అంతర్జాతీయ పరిణామాలతో ఇండియాలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రభావితం అవుతోంది. ఇక్కడ ప్రధాన కారణం పడిపోతున్న రూపాయి మారకపు విలువగా వెల్లడైంది. దీంతో అమెరికన్ డాలర్లు, యూరోల్లో తమ సంపాదనను ఎన్ఎఆర్ఐలు ఇండియాకు పంపటం కారణంగా ఎక్కువ రూపాయలు వస్తున్నాయి. దీంతో విదేశీ కరెన్సీల్లో సంపాదిస్తున్న ప్రవాస భారతీయుల డబ్బుకు కొనుగోలు శక్తి పెరిగిపోయింది. దీంతో ఖరీదైన స్థలాలు, ఇళ్లతో పాటు ఫ్లాట్ల కొనుగోలు వారికి అనుకూలంగా మారింది. పెద్ద మెుత్తంలో డబ్బును వారు దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో ప్రయోజనం పొందాలని భావిస్తున్నారు.

Also Read : క్వార్టర్లీ బోనస్‌ విషయంలో టెక్కీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్

అయితే ఈ ధోరణిపై కొందరు నెట్టింట నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐల కారణంగా దేశంలో హౌసింగ్, రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగి స్థానిక ప్రజలు కొనలేని స్థాయిలకు చేరుకుంటున్నాయని వాధిస్తున్నారు. అయితే దీనిపై విజ్డమ్ హ్యాచ్ వ్యవస్థాపకులు అక్షత్ శ్రీవాస్తవ్ స్పందిస్తూ.. సమస్యకు మూలకారణం దేశీయంగా తక్కువగా ఉన్న వేతనాలు, ఉద్యోగాల లేమి, ప్రభుత్వ పాలసీలు, అధిక విలువ కలిగిన వ్యాపారాలను ఆకర్షించలేకపోవటం వంటివిగా పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు బలమైన కరెన్సీల్లో సంపాదిస్తున్నందునే భారతదేశంలో రియల్టీ పెట్టుబడులు చేయగలుగుతున్నారని వెల్లడించారు.

 

ప్రస్తుతం తాను నివసిస్తున్న గోవాలో ఎన్ఆర్ఐలు ఎడాపెడా ప్రాపర్టీలు కొంటున్నారని.. వారు కొనగలిగిన స్థాయిలో సంపాదన ఉండటమే దానికి కారణంగా శ్రీవాస్తవ్ అన్నారు. అయితే విదేశాల్లోని ప్రవాస భారతీయులు తమ పెట్టుబడి పోర్ట్ ఫోలియోను డైవర్సిఫై చేసుకోవటంలో భాగంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారన్నారు. ఇదే క్రమంలో భారతదేశంలోని చాలా మంది ప్రజలు అమెరికా స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లలో పెట్టుబడి పెడుతున్నారని కూడా పేర్కొన్నారు. ప్రధానంగా బెంగళూరు, పూణే, నోయిడా వంటి నగరాల్లో లగ్జరీ రియల్టీకి పెరుగుతున్న డిమాండ్ ఎన్ఆర్ఐలు తమ డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తోందని అన్నారు. పైగా ఇక్కడి రియల్టీలో పెట్టుబడులు వారికి అనేక పన్ను ప్రయోజనాలను కల్పిస్తున్నాయని శ్రీవాస్తవ్ వెల్లడించారు.