ఇయ్యాల ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్ లాంచింగ్

ఇయ్యాల ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్ లాంచింగ్

హైదరాబాద్, వెలుగు: నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో గురువారం ఉదయం 10 గంటలకు ఎన్ లైవ్ ఆస్ట్రో కు సంబంధించిన ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధిత ఆన్ లైన్ వెబ్ సైట్, యాప్ ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుందని సంస్థ అధినేత నరసింహస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత జ్యోతిష్యంపై సెమినార్ ఉంటుందన్నారు.

ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెమినార్ జరుగుతుందన్నారు. యాప్​ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్​లోడ్ చేసుకుని ఆధ్యాత్మిక, జ్యోతిష్యానికి సంబంధించిన సర్వీసులను  పొందవచ్చన్నారు.