న్యూఢిల్లీ: హాస్పిటల్స్ చెయిన్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ డీమెర్జర్ లేదా కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌కు ఎన్‌ఎస్‌ఈ బుధవారం ‘నో అబ్జెక్షన్’ అనుమతులు ఇచ్చింది.
ఈ స్కీమ్‌లో భాగంగా అపోలో హెల్త్‌కో లిమిటెడ్, కైమెడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు అపోలో హెల్త్‌టెక్ లిమిటెడ్‌లో విలీనం అవుతాయి. అలానే అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ నుంచి ఫార్మసీ, డిజిటల్ హెల్త్ యూనిట్లు అపోలో హెల్త్‌టెక్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.
తర్వాత అపోలో హెల్త్‌టెక్ లిమిటెడ్ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్టింగ్ అవుతాయి. ఇది సెబీ అనుమతులు, షరతులపై ఆధారపడి ఉంటుంది. స్కీమ్ అమలుకావడానికి షేర్‌హోల్డర్లు, క్రెడిటర్లు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం అవసరం.
