మల్లారెడ్డి హాస్పిటల్ ముందు NSUI ధర్నా

V6 Velugu Posted on May 07, 2021

హైదరాబాద్ సూరారంలోని మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్ ముందు NSUI కార్యకర్తలు ధర్నా చేశారు. చెరువు భూములు కబ్జా చేసి మల్లారెడ్డి హాస్పిటల్ కట్టారని ఆరోపించారు. మల్లారెడ్డి హాస్పిటల్ ను ఉచిత కరోనా హాస్పిటల్ గా మార్చాలంటూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.  హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత హాస్పిటల్ గేటు ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని దుండిగల్ పీఎస్ కు తరలించారు పోలీసులు. డాక్టర్లు రోగుల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపడుతుంటే విద్యార్థులు దాడులు చేయడం సరికాదన్నారు మల్లారెడ్డి హాస్పిటల్ ఎండీ ప్రీతిరెడ్డి. 

Tagged NSUI Leaders, Protest, Malla Reddy Hospital, MD preethi reddy

Latest Videos

Subscribe Now

More News