విద్యుత్ ఛార్జీలను తగ్గించాలె

విద్యుత్ ఛార్జీలను తగ్గించాలె

హైదరాబాద్: పెంచిన విద్యుత్  ఛార్జీలకు  నిరసనగా ఎన్ఎస్యూఐ విద్యార్థులు  ట్రాన్స్ కో  ఆఫీసును ముట్టడించారు.అనంతరం విద్యుత్ సౌధ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్  చార్జీలతో పేద, మధ్య తరగతి  కుటుంబాలపై  భారం పడుతుందన్నారు.పెంచిన కరెంట్  చార్జీలను  వెంటనే తగ్గించాలని  డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంత సమయం పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.