లండన్ లో ఎన్టీఆర్ క్రేజ్.. దద్దరిల్లిపోతున్న థియేటర్స్

లండన్ లో ఎన్టీఆర్ క్రేజ్.. దద్దరిల్లిపోతున్న థియేటర్స్

లండన్ లో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అక్కడ కూడా యంగ్ టైగర్ ఇరగదీస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి మూవీని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఇందుకోసం ఏర్పాటు చేసిన షోస్ అన్నీ వారం ముందు గానే హౌస్ ఫుల్ అయిపోయాయి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది ఎన్టీఆర్ క్రేజ్ ఏంటా అని.

 సింహాద్రిగా స్క్రీన్ పై ఎన్టీఆర్ మాస్ నటనకు థియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. తాజాగా లండన్ లో కూడా ఎన్టీఆర్ థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన  ఫ్యాన్స్.. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.