దేవర టీజర్ అప్డేట్ వచ్చేసింది.. అదిరిపోయిన ఎన్టీఆర్ మాస్ అవతార్

దేవర టీజర్ అప్డేట్ వచ్చేసింది.. అదిరిపోయిన ఎన్టీఆర్ మాస్ అవతార్

RRR లాంటి గ్లోబల్ హిట్ తరువాత  యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుస్తున్న ఈ  సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.  

ఇదిలా ఉంటే.. గత వారం రోజులుగా దేవర టీజర్ న్యూస్ వైరల్ గా మారింది. అప్పుడు, ఇప్పుడు అంటూ సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. తాజాగా ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. దేవర ఫస్ట్ గ్లింప్స్ జనవరి 8న రానుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని తారక్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో తారక్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో టక్ చేసుజిని పడవలో సముద్రం నుండి వస్తున్నట్టుగా ఉన్నారు. ఈ పవర్ ఫుల్ లుక్ మాస్ ఆడియన్స్ ను, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. దేవర దిగాక రికార్డుల వేట మొదలవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పోస్టర్ ఈ రేంజ్ లో ఉందంటే.. జనవరి 8న రానున్న టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో తారక్ సరసన  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.