ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో క్రీడోత్సవాలు..ప్రారంభించిన నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో క్రీడోత్సవాలు..ప్రారంభించిన నారా భువనేశ్వరి

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేటలోని ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో మూడు రోజుల క్రీడోత్సవాలను చైర్మన్ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్ర కుమార్, సీఓఓ గోపి కలిసి శనివారం ప్రారంభించారు. క్రీడలు శరీర దారుఢ్యం, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని, విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాన్ని వెలికితీస్తాయని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో పాల్గొంటేనే విజ్ఞానం పెరుగుతుందన్నారు. ఎన్టీఆర్ సంస్థల్లో చదివిన విద్యార్థులు విదేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు.