నాటు కోడి పులుసు పంపిన ఎన్టీఆర్.. థాంక్యూ అన్నయ్య

నాటు కోడి పులుసు పంపిన ఎన్టీఆర్.. థాంక్యూ అన్నయ్య

మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) కోసం నాటు కోడి పులుసును పంపాడట ఎన్టీఆర్(Jr Ntr). దానికి బదులుగా థాంక్యూ అన్నయ్య అంటూ రిప్లై ఇచ్చింది ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి(Likitha reddy). ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్ డే. ఇందులో భాగంగా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాల మంది సెలబ్రెటీలు ప్రశాంత్ కు విషెస్ తెలిపారు. ఇక టాలీవుడ్ నుండి రామ్ చరణ్(Ram charan), తారక్(Tarak) లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ కు విషెస్ ను తెలియజేశారు.

ఇక తారక్ అయితే ఏకంగా నాటు కోడి పులుసు పంపించి మరీ బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రగ్గుడ్ లుక్ లో, గుబురు గడ్డంతో ఉన్న ఎన్టీఆర్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

ఇక కేజీఎఫ్ 2తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. తన తరువాత సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడు. సలార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత తారక్ మూవీ మొదలుపెట్టనున్నాడు ప్రశాంత్ నీల్.