NTR Dragon Glimpse Talk: 'డ్రాగన్' వర్సెస్ 'సలార్', 'కేజీఎఫ్'.. మళ్లీ అదే బొగ్గు పొడినా?.. ప్రశాంత్ నీల్‌పై ట్రోల్స్!

NTR Dragon Glimpse Talk: 'డ్రాగన్' వర్సెస్ 'సలార్', 'కేజీఎఫ్'.. మళ్లీ అదే బొగ్గు పొడినా?.. ప్రశాంత్ నీల్‌పై ట్రోల్స్!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల మూవీ 'డ్రాగన్'.  తారక్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. 1967 నాటి అంతర్జాతీయ ఓపియమ్ (నల్లమందు) మాఫియా, 'ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ' నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్‌లో తారక్ 'లూగర్' అనే క్రూరమైన హంతకుడు పాత్రలో రౌద్ర రూపాన్ని చూపించారు. గ్లింప్స్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో 'కేజీఎఫ్' (KGF), సలార్ చిత్రాలతో 'డ్రాగన్' ను పోలుస్తూ నెటిజన్లు తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ మొదలుపెట్టారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ అనగానే మనకు గుర్తొచ్చేది. కోల్‌మైన్స్, డార్క్ థీమ్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలివేషన్స్ ఇచ్చే వాయిస్ ఓవర్,  భారీ గన్‌లు, బొగ్గు గనులు లేదా ఎడారి వాతావరణం. యశ్ ‘కేజీఎఫ్’, ప్రభాస్ ‘సలార్’ సినిమాల్లో ఇదే ఫార్ములాను వాడారు. ఇప్పుడు ‘డ్రాగన్' గ్లింప్స్  చూశాక కూడా నెటిజన్లు అదే ఫీలింగ్‌ను వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా ట్రోల్స్ ట్రెండ్

ప్రశాంత్ నీల్ దగ్గర ఒకే ఒక్క కలర్ గ్రేడింగ్ సాఫ్ట్‌వేర్ ఉందా?, యాష్ కేజీఎఫ్, సలార్  సినిమాలను, ఎన్టీఆర్ డ్రాగన్‌ను పక్కపక్కన పెడితే కేవలం హీరోల ముఖం మాత్రమే మారింది, మిగతా సెటప్ అంతా ఒకటే, సలార్ అయిపోయింది.. ఇప్పుడు డ్రాగన్.. నీల్ మామ ఇంకెన్నాళ్లు ఈ నలుపు రంగుతోనే సినిమాలు తీస్తావ్? అంటూ నెటిజన్లు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దగ్గర వేరే కలర్స్ లేవా బాస్? కేజీఎఫ్‌లో నలుపు, సలార్‌లో బూడిద రంగు, డ్రాగన్‌లో ముదురు నలుపు.. సినిమా ఏదైనా మాకు స్క్రీన్ మీద బొగ్గుపొడి కనిపించాల్సిందేనా? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

సేమ్ టు సేమ్ ..

ముఖ్యంగా "కేజీఎఫ్‌"లో రాఖీ భాయ్, "సలార్‌"లో దేవా.. ఇప్పుడు "డ్రాగన్‌"లో ఎన్టీఆర్. కటౌట్లు మారినా.. కొన్ని షాట్స్ ఒకేలా ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తూ కొందరు విమర్శిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఈ పాత్రకు కాస్త చిన్నదిగా  అనిపిస్తోందని, ప్రభాస్ లేదా యాష్ లాంటి కటౌట్ అయితే బాగుండేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 'సలార్‌'లో డైనోసార్ డైలాగ్ గుర్తుందిగా? ఇప్పుడు డ్రాగన్ ట్రైలర్‌లో కూడా అలాంటిదే ఒక భారీ ఎలివేషన్ డైలాగ్ పెట్టడంతో.. సలార్ స్క్రిప్ట్‌నే అటు ఇటు తిప్పి డ్రాగన్ చేశారా నీల్ గారు?" అంటూ నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.

 

నీల్ యూనివర్స్..

ఒకవైపు ఈ పోలికలపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇది ప్రశాంత్ నీల్ బ్రాండ్.. ఆ ఎలివేషన్లు థియేటర్లలో ఇస్తే వచ్చే పూనకాలు వేరే లెవెల్‌లో ఉంటాయి అని డిఫెండ్ చేస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్, అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ లాంటి క్రేజీ కాస్టింగ్‌తో రాబోతున్న ఈ సినిమా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.  ఏదేమైనా, కేజీఎఫ్, సలార్‌లతో ఆల్రెడీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఈ ‘డ్రాగన్’తో హ్యాట్రిక్ కొడతారా లేదా ఈ ట్రోల్స్‌కు థియేటర్లలోనే సమాధానం చెప్తారా అనేది చూడాలి..