టీచర్స్ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ పోరాటం

టీచర్స్ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ పోరాటం

తొర్రూరు, వెలుగు : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి అన్నారు. ఎస్టీయూ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎస్టీయూ జెండా ఆవిష్కరించారు.

అనంతరం ఎస్టీయూలోని సీనియర్ కార్యకర్త చంద్ర ప్రకాశ్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాకుబ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రప్రకాశ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.