- 42 మంది యువతుల అరెస్ట్
పంజాగుట్ట, వెలుగు: బంజారాహిల్స్‌లోని టాస్ పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 42 మంది యువతులను అరెస్ట్‌చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వీరిని ఇతర ప్రాంతాల నుంచిపబ్ నిర్వాహకులు ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. వీకెండ్లో పబ్‌కు వచ్చి, కస్టమర్లతో చనువుగా ఉండాలని, ఎవరు ఎక్కువ బిల్లు చేయిస్తే వారికి కమిషన్ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మంది యువతులు గతంలో ఊర్వశి బార్, ఆఫ్టర్ 9 పబ్‌లో పట్టుబడినట్లు గుర్తించామన్నారు. పబ్‌ను సీజ్ చేసి, ఎక్సైజ్అధికారులకు రిపోర్ట్ పంపినట్లు తెలిపారు. పబ్నిర్వాహకులు బలరాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శ్రావణ్‌గౌడ్, డీజే ప్లేయర్లు, బౌన్సర్లపైనా కేసు నమోదు చేసినట్టు చెప్పారు.