నేను షేర్ చేసిన 7 ఫొటోల్లో ఆ ఫొటో లేదు

నేను షేర్ చేసిన 7 ఫొటోల్లో ఆ ఫొటో లేదు

అమెరికన్ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. అయితే తాను షేర్ చేసిన 7 ఫొటోల్లో ఒక ఫొటో మాత్రం లేదని రణ్ వీర్ చెప్పుకొచ్చాడు. ఆ ఫొటోను ఎవరో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. గత కొన్ని రోజుల క్రితం ముంబయిలోని చెంబూర్ లో రణ్ వీర్ కు వ్యతిరేకంగా తమ మనోభావాలు దెబ్బతీసేలా ఫొటోషూట్ ఉందని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ముంబయి పోలీసులకు రణ్ వీర్ వాంగ్మూలం కూడా సమర్పించాడు.

తన ఫొటోను ఎవరో మార్ఫింగ్ చేశాడని పోలీసులకు తెలిపారు. ఆగస్టు 29న రణ్ వీర్ పై నమోదైన కేసు నేపథ్యంలో ఆయన్ని పోలీసులు ఇటీవలే విచారణకు పిలిచారు. అయితే తాను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన 7 ఫొటోలలో ఒక ఫొటో మాత్రం లేదని రణ్ వీర్ పోలీసులకు వెల్లడించాడు. ఈ సందర్భంగా తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలను పోలీసులకు అందించాడు.