భాగ్యనగరంలో నుమాయిష్ జోష్

భాగ్యనగరంలో  నుమాయిష్  జోష్

నాంపల్లిలోని నుమాయిష్‌‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. 82 వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ను మంత్రులు మంత్రి హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్  జరగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో 2400  స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులు ఈ స్టాళ్లను విక్రయిస్తారు. ఎగ్జిబిషన్లో  దాదాపు 1,500 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు.  

పిల్లలకు ఉచితం..

నుమాయిష్ ఎంట్రీ టికెట్ రేటును రూ.40గా నిర్ణయించారు. ఐదేండ్లలోపు పిల్లలు ఉచితంగా నుమాయిష్ను సందర్శించొచ్చు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.  గతంలో మాదిరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు వీలుగా ఓపెన్ ఎయిర్ థియేటర్‌‌‌‌ని ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌కు మెట్రో సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో..అదనపు మెట్రో ట్రైన్లను నడిపేందుకు హెచ్ఎంఆర్‌‌‌‌ ఒప్పుకుంది. ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సులను నడిపేందుకు అంగీకరించింది. సందర్శకులకు ఫ్రీ, పెయిడ్‌‌ పార్కింగ్‌‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పెయిడ్ పార్కింగ్ కావాలనుకునే వారికి ఇంటర్మీడియెట్ బోర్డ్ కాంపౌండ్‌‌లో ఏర్పాట్లు చేశారు.