సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన నర్సులు

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన నర్సులు

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు నర్సులు. విధుల నుంచి తొలగించటంపై మండిపడుతున్నారు. కరోనా టైంలో ఏడాది పాటు కోవిడ్ సేవలు చేయించుకొని అర్ధంతరంగా తొలగించటంపై సీరియస్ అవుతున్నారు. విడతల వారీగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వస్తున్నారు. కొద్ది సేపు అక్కడే రోడ్డుపై భైఠాయించారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై నిరసనకు కూర్చున్న నర్సులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేట్లను దాటుకెళ్లిన నర్సులు... క్యాంప్ ఆఫీస్ గేటు దగ్గర దాకా వెళ్లారు. 1640 మంది కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.