
హైదరాబాద్: టాలీవుడ్ నటి కల్పికపై గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ సిబ్బంది దాడి చేశారు. మొదట.. బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారగా.. నటి కల్పికపై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమెపై దాడికి దిగారు. దీంతో పబ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వెంటనే పబ్ యజమాన్యం, ఇతరులు కలగజేసుకుని ఇరువురిని శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. మరీ పబ్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై నటి కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అన్న దానిపై సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పికా గణేష్గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. నటుడు అభినవ్ గోమటంపై ఆమె కాంట్రవర్శియల్ కామెంట్స్చేసింది. అభినవ్ పురుషాహంకారి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
►ALSO READ | Sreeleela: ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. అంతలోనే శ్రీలీల నిశ్చితార్థం అని ఫోటోలు వైరల్!
కల్పిక ఆరోపణలకు అభినవ్ కూడా కౌంటర్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతేకాకుండా కల్పిక, అభినవ్ ప్రేమలో ఉన్నట్లు కూడా సినీ సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమన్నాయి. తామిద్దరం స్నేహితులమని ఇద్దరి మధ్య ప్రేమా గీమా లాంటివేమీ లేవని అభినవ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్‌కు చెక్ పడింది.