
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న (మే30న) శ్రీలీల కొన్ని అందమైన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ‘బిగ్ డే’,‘కమింగ్ సూన్’ అనే క్యాప్షన్ అని పెట్టింది. దీంతో శ్రీలీల సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
శ్రీలీలకు ఉన్న క్రేజీ దృష్ట్యా.. ఫొటోలు షేర్ చేసిన నిమిషంలోనే ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాయి. ఆ ఫొటోస్ లో శ్రీలీల సాంప్రదాయ దుస్తులను ధరించి.. ఆనందంతో మురిసిపోతూ కనిపించింది. ముఖంపై హల్ది పూసుకుని, కుంకుమ ట్రేలు, బంధువులు సిందూరం పెడుతూ కాబోయే వధువులా శ్రీలీలను అలంకరిస్తున్నారు.
ఈ ఫొటోలు చూసిన, ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, ఇది ఆమె పెళ్లినా? లేక సినిమా షూటింగా అనే విషయంలో సోషల్ మీడియాలో గోల గోల నడుస్తుంది. ఈ ఫోటోలపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో (Kartik Aaryan) కొంతకాలంగా శ్రీలీల డేటింగ్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై కార్తీక్, శ్రీలీల ఇద్దరూ ఇప్పటి వరకు నోరెత్తలేదు. అలా అని ఎక్కడా ఖండించలేదు. కార్తీక్ ఆర్యన్ డేటింగ్ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే.. శ్రీలీల ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
రీసెంట్గా శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలసి ఒకే ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తన సోదరి కృతికా తివారీతో కలిసి శ్రీలీల కిస్సిక్కి డ్యాన్స్ చేస్తుండగా, కార్తీక్ ఆర్యన్ ఆమె పక్కన నిలబడి తన ఫోన్లో ఈవెంట్‌ను రికార్డ్ చేస్తుంటాడు.
ప్రస్తుతం ఈ జంట అనురాగ్ బసు దర్శకత్వంలో 2025 దీపావళికి విడుదల కానున్న ఆషికి 3 మూవీలో నటిస్తున్నారు. అక్కడే వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అనేది సినీ ఇండస్ట్రీ టాక్.
అసలు విషయం ఏంటంటే:
శ్రీలీల షేర్ చేసిన ఫొటోస్ కేవలం ఆమె ఇంట సంప్రదాయబద్దంగా నిర్వహించే ఓ కార్యక్రమం అని సమాచారం. జూన్ 14న శ్రీలీల బర్త్ డే వేడుక వస్తుండటంతో ముందస్తుగా ఓ చిన్న వేడుకను నిర్వహించినట్లు సమాచారం. తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్ చేసుకునేలా ఆమె కుటుంబ సభ్యులు ప్లాన్ చేసి ఉండొచ్చు అని ఇండస్ట్రీ టాక్.
శ్రీలీల చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతర సినిమాల్లో శ్రీలీలనే హీరోయిన్. మాస్ జాతర వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. తమిళంలో శివకార్తికేయన్ తో పరాశక్తి మూవీలో నటిస్తోంది. ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.