
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను ఇంగ్లాండ్ గ్రాండ్ గా ఆరంభించింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ దుమ్ములేపుతూ తొలి వన్డేలో విండీస్ జట్టును చిత్తుగా ఓడించింది. గురువారం (మే 29) ఎడ్జ్‌బాస్టన్‌లో ముగిసిన తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ పై 238 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో రెండు ప్రపంచ రికార్డ్స్ నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఏడుగురు బ్యాట్స్‌మెన్ 30+ పరుగులు చేయడం:
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 400 స్కోర్ కొట్టినా ఏ ఒక్కరూ సెంచరీ చేయకపోవడం విశేషం. వచ్చినవారు వచ్చినట్టు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించారు. ఇంగ్లాండ్ లోని టాప్-7 లో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లందరూ 30 పైగా పరుగులు చేయడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక జట్టులోని టాప్-7 ప్లేయర్స్ 30కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఓపెనర్ జేమీ స్మిత్ 24 బంతుల్లో 37 పరుగులు చేయగా, బెన్ డకెట్ అద్భుతమైన అర్ధ సెంచరీతో 48 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
►ALSO READ | Gavi: వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అంటే నువ్వే బ్రో: స్పెయిన్ యువరాణిని రిజెక్ట్ చేసిన ఫుట్ బాల్ స్టార్.. కారణమిదే!
మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జో రూట్ (65 బంతుల్లో 57 పరుగులు), బ్రూక్ (45 బంతుల్లో 58) అర్ధ సెంచరీలు సాధించారు. 5వ స్థానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ 32 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిడిల్ ఆర్డర్ లో జాకబ్ బెతేల్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. ఏడో స్థానంలో విల్ జాక్స్ చివర్లో ( 24 బంతుల్లో 39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
హ్యారీ బ్రూక్ 5 క్యాచ్ లు:
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొత్తం 5 క్యాచ్ లు అందుకున్నాడు. దీంతో వికెట్ కీపర్ గా కాకుండా వన్డే మ్యాచ్ లో ఫీల్డర్ గా అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్ గా సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్ రికార్డ్ సమం చేశాడు. 26 వన్డేల్లో కేవలం మూడు క్యాచ్‌లు మాత్రమే పట్టిన బ్రూక్, ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.