Gavi: వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అంటే నువ్వే బ్రో: స్పెయిన్ యువరాణి‌ని రిజెక్ట్ చేసిన ఫుట్ బాల్ స్టార్.. కారణమిదే!

Gavi: వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అంటే నువ్వే బ్రో: స్పెయిన్ యువరాణి‌ని రిజెక్ట్ చేసిన ఫుట్ బాల్ స్టార్.. కారణమిదే!

స్పెయిన్ యువ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ గవి ప్రపంచంలో సంచలనంగా మారాడు. ఇప్పటికే ఫుట్ బాల్ తో అంచలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్ స్టార్ గా కితాబులందుకుంటున్నాడు. తన ఆటతో ఆకట్టుకున్న గవి.. తాజాగా తన వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. గవి స్పెయిన్ యువరాణి లియోనార్‌ను రిజెక్ట్ చేయడం వైరల్ గా మారుతుంది. తనకు అంతకముందే లవర్ ఉండడంతో స్పెయిన్ యువరాణికి నో చెప్పాడట. 

అసలేం జరిగిందంటే..?
 
ఆమె స్పెయిన్ యువరాణి లియోనార్‌. ఇతను స్పెయిన్ ఫుట్ బాల్ ప్లేయర్ గవి. ఒక మీటింగ్ లో  లియోనార్‌, గవి కలుసుకున్నారు. ఆ తర్వాత గవిని ఆమె లవ్ చేయడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత లియోనార్‌ తన ప్రేమ సంగతి చెప్పి అతన్ని డేటింగ్ కు రమ్మని చెప్పింది. అయితే ఆమె ప్రపోజల్ ను గవి తిరస్కరించాడు. ఆ తర్వాత తాను ఆడుతున్న నెక్స్ట్ మ్యాచ్ కు తన లవర్ ను తీసుకొచ్చాడు. అందరికీ ఆమె తన లవర్ అని పరిచయం చేశాడు. లియోనార్‌ కి ఓకే చెప్పి ఉంటే గవి స్పెయిన్ కు కింగ్ అయ్యేవాడు. కానీ అతని మొదటి ప్రాధాన్యత మాత్రం తన లవర్ కే ఇచ్చాడు.  

►ALSO READ | IPL 2025: ఒక్క ఫైనల్ కూడా ఓడిపోలేదు.. RCB అదృష్టమంతా అతని దగ్గరే ఉంది

స్పెయిన్ యువ రాణిని రిజెక్ట్ చేయడంతో అందరి దృష్టి గవి ప్రేమిస్తున్న అమ్మాయి మీద పడింది. ఆమె పేరు అనా పెలాయో. వీరిద్దరూ చిన్నపాటి నుంచి లవ్ చేసుకుంటున్నారు. అనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ చిత్రాలను షేర్ చేస్తుంది. ఒక ఫోటోలో, ఆమె పూర్తి స్లీవ్‌లతో తెల్లటి మినీ డ్రెస్.. సీ-త్రూ క్రోచెట్ ప్యాటర్న్ ధరించి కనిపించింది. గావిపై సోషల్ మీడియాలో పొగుడుతూ నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు. ఇంకా ట్రూ లవ్ బతికే ఉందని చెబుతున్నారు. కొంతమంది నువ్వు వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు. 

గవి కెరీర్‌ను పరిశీలిస్తే.. అతని పూర్తి పేరు పాబ్లో పేజ్ గవీరా. అతను 5 ఆగస్టు 2004న జన్మించాడు. గవి ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాలో కూడా భాగంగా ఉంది. అతను 29 ఆగస్టు 2021న అరంగేట్రం చేశాడు. బార్సిలోనా తరపున ఆడిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ కప్ చరిత్రలో గోల్ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా గవి నిలిచాడు. ఈ రికార్డు అతనికి చారిత్రాత్మకమైనది. ఈ రికార్డు గవి కంటే ముందు అత్యుత్తమ ఆటగాడు పీలే పేరిట ఉంది. అతను 17 సంవత్సరాల 249 రోజుల వయస్సులో స్వీడన్‌తో జరిగిన 1958 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గోల్ చేశాడు.