ప్యాంట్ విప్పేసి న‌ర్సుల‌పై జ‌మాత్ పేషెంట్ల‌ వేధింపులు.. స‌ర్కార్ క‌ఠిన‌మైన‌ కేసులు

ప్యాంట్ విప్పేసి న‌ర్సుల‌పై జ‌మాత్ పేషెంట్ల‌ వేధింపులు.. స‌ర్కార్ క‌ఠిన‌మైన‌ కేసులు

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి హాజరై కరోనా లక్షణాలతో ఘజియాబాద్ ఆస్పత్రిలో చేరిన ఆరుగురు తబ్లీఘ్ జమాత్ సభ్యులపై కేసు నమోదయింది. ఆస్పత్రిలో అర్థనగ్నంగా తిరుగుతూ నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వారిపై ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిగరెట్లు కావాలని డిమాండ్ చేస్తూ.. అసభ్యంగా మాట్లాడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 354, 294, 509, 269, 270, 271 ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు పోలీసులు.

ఒక్క‌సారిగా పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ కంట్రోల్ లోకి వ‌స్తోంద‌నుకుంటున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్కజ్ లో జ‌రిగిన‌ త‌బ్లిగీ జామాత్ స‌ద‌స్సు ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. దేశ రాజ‌ధానిలో మార్చి 13-15 మ‌ధ్య సాగిన‌ ఈ మ‌త ప్రార్థ‌న‌ల‌కు విదేశాల నుంచి 900 మందికి పైగా విదేశీయులు రావ‌డం.. అక్క‌డికి దేశం న‌లుమూల‌ల నుంచి ముస్లిం భ‌క్తులు వెళ్ల‌డంతో వారి నుంచి క‌రోనా వైర‌స్ సోకింది. వారంతా తిరిగి త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయాక ఒక్క‌సారిగా క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌డం మొద‌లైంది.

న‌ర్సుల‌కు అస‌భ్యంగా వేళ్లు చూపిస్తూ..

లాక్ డౌన్ స‌మ‌యంలోనూ నిజాముద్దీన్ మ‌ర్కజ్ లో వంద‌ల మంది జ‌మాత్ కార్య‌క‌ర్త‌లు అక్క‌డ ఉన్న‌ట్లు గుర్తించ‌డంతో ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంగ‌ణానికి చేరుకుని వారంద‌రినీ ఖాళీ చేయించి.. క్వారంటైన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించారు. వారిలో ప‌లువురికి క‌రోనా ఉన్న‌ట్లు టెస్టుల్లో తేలింది. అయితే వాళ్లు ఢిల్లీలోని క్వారంటైన్ సెంట‌ర్ల‌లో వైద్య సిబ్బంది ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం అక్క‌డ పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేయాల‌ని గురువారం ఢిల్లీ క‌మిష‌న‌ర్ కు లేఖ రాసింది. ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల్లోనే యూపీలోని ఘిజ‌యాబాద్ లో జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులో ఉన్న జామాతీ పేషెంట్లు కొంద‌రు న‌ర్సుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్యాంట్లు విప్పేసి తిరుగుతూ.. చేతి వేళ్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన సింబ‌ల్స్ చూపిస్తూ, సిగ‌రెట్లు కావాల‌ని గోల చేస్తూ నోటికొచ్చిన భాష వాడుతున్నార‌ని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ విష‌యం యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాద్ దృష్టికి వెళ్ల‌డంతో జాతీయ భ‌ద్ర‌త చ‌ట్టం కింద క‌ఠిన‌మైన కేసులు పెట్టాల‌ని ఆదేశించారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 354, 294, 509, 269, 270, 271 ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు పోలీసులు.

ఏపీలో 161 కి చేరిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2552..మరణాలు 72

మోడీ మరో సందేశం..ఆదివారం 9 నిమిషాలు ఏం చేయాలంటే.?

కరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్​లైన్స్