హైదరాబాద్, వెలుగు : ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ప్రాజెక్ట్ కోసం ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి మంచి స్పందన వస్తున్నదని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు కన్సార్టియంల నుంచి 13 ఇండియన్, ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీలు ప్రీ క్వాలిఫికేషన్ బిడ్‌లను అందజేశాయని పేర్కొన్నారు.
సిస్ట్రా (ఫ్రాన్స్)–రైట్స్ (ఇండియా)–డీబీ ఇంజనీరింగ్ అండ్ కన్సల్టింగ్ (జర్మనీ), అయేసా ఇంజెనేరియా వై అర్కిటెక్చురా (స్పెయిన్)–నిప్పాన్ కోయి (జపాన్)–ఆర్వీ అసోసియేట్స్ (ఇండియా), టెక్నికా వై ప్రోయెక్టోస్ (స్పెయిన్)– పీఐఎన్‌ఐ గ్రూప్ (స్విట్జర్లాండ్), ఏఈసీఓఎం ఇండియా–ఎగిస్ రెల్ (ప్రాన్స్)–ఎగిస్ ఇండియా, కన్సల్టింగ్ ఇంజనీర్స్ గ్రూప్ (ఇండియా)–కొరియా నేషనల్ రైల్వే (దక్షిణ కొరియా) కంపెనీలు ప్రీ అప్లికేషన్ లను సమర్పించాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత, ఈ నెలాఖరులోగా -క్వాలిఫైడ్ బిడ్డర్‌లకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) పత్రాలు జారీ చేయబడతాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

