V6 News

అంబేద్కర్ కాలేజీలో న్యాయ ఉత్సవ్

అంబేద్కర్ కాలేజీలో న్యాయ ఉత్సవ్

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లా కాలేజీలో స్టూడెంట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కాకా ఏఎల్​సీ న్యాయ ఉత్సవ్ 2026’ మంగళవారం ఘనంగా జరిగింది. “అంబేద్కర్ బ్లూప్రింట్: ఏ లెగసీ దట్ లివ్డ్” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో కాలేజీ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సృజన పాల్గొన్నారు. 

సమానత్వ సమాజ నిర్మాణంలో న్యాయ విద్యార్థుల పాత్రను వివరించారు. ఈ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘లెక్స్ ఎగ్జిబిషన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు సమకాలీన న్యాయ సమస్యలు, రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే అద్భుతమైన నమూనాలను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటారు. అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.