షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించారు. జనవరి 2న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో రాబోతోన్న సినిమా ఇది. సందేశాత్మకంగా ఉంటూనే ఎంటర్‌టైన్ చేస్తుంది.
ముఖ్యంగా అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ కీలక పాత్రలు పోషించారు’ అని చెప్పాడు. అమ్మాయిల్ని మోసం చేస్తే.. ఆ అందం రాక్షసిగా ఎలా మారుతుందని ఇందులో చూపించినట్టు హీరోయిన్స్ చెప్పారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తీశామని ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన భాష్యశ్రీ చెప్పాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.
