ముందూ వెనకా చూసుకోవాలి కదా : సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ రాసలీలలు

ముందూ వెనకా చూసుకోవాలి కదా : సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ రాసలీలలు

లోక్ సభ ఎన్నికలు దగ్గపడుతున్న వేళ బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ దేశ వ్యాప్తంగా 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసి కొన్ని గంటలు గడవక ముందే బారాబంకి ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా రిలీజ్ కావడం రాజకీయంగా కలకలం రేపింది.  

వీడియోలో ఉపేంద్ర ఓ మహిళతో కలిసి ఓ హోటల్ పాడు పనికి పాల్పడ్డట్టు ఉంది. వీడియోలో ఉన్నది సిట్టింగ్ ఎంపీ, పైగా అధికార పార్టీకి చెందిన నేత కావడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియోపై ఉపేంద్ర పర్సనల్ సెక్రటరీ స్పందిస్తూ ఆ వీడియోలో ఎంపీ ఫోటోను ఎవరో కావాలని మార్ఫింగ్ చేసి పెట్టారని చెప్పారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ లోని కాత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు.

 బీజేపీ పార్టీ అభ్యర్థిగా మరోసారి ఉపేంద్రను ప్రకటించడంతో, ఎంపీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు వ్యక్తులు అభ్యంతరకర వీడియోను బహిరంగపరిచారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వీడియోపై స్పందిస్తూ కేసు నమోదు చేశామని విచారణ చేపడుతున్నామని తెలిపారు.