23న ఓసీల చలో ఢిల్లీ..మహాధర్నాకు 5 ప్రత్యేక రైళ్లు

23న ఓసీల చలో ఢిల్లీ..మహాధర్నాకు 5 ప్రత్యేక రైళ్లు

బషీర్​బాగ్, వెలుగు : ఓసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన “జాతీయ స్థాయి ఓసీల మహా ధర్నా”కు 5 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​ లో ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు రిజర్వేషన్లు లేకపోవడంతో సంక్షేమ పథకాల ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.