
పద్మారావునగర్, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే స్టేట్ టాప్లో ఉందని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సనత్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ జీరా, వెంగళ్ రావు నగర్, కస్తూర్బా నగర్, అంబేడ్కర్ నగర్ ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానికులు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అత్యధిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జీరాలోని పార్క్ లో మంత్రి సహకారంతో పునర్నిర్మించిన బాపన ఎల్లమ్మ ఆలయంను ప్రారంభించగా, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, కిరణ్మయి, నేతుల అత్తిలి శ్రీనివాస్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, కిషోర్, గణేష్, మల్లేశ్, రాజు, జనార్దన్ పాల్గొన్నారు.
నిరంతర అభివృద్ధి చేస్తున్నాం
ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని మోడల్ కాలనీ, సుందర్ నగర్ కాలనీ వాసులు నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, అధ్యక్షులు మంచారావు, కొండల్ రావు, బుచ్చిబాబు,, సాయి పాల్గొన్నారు.
సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
జెక్ కాలనీలోని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో మంత్రి పాల్గొనగా చర్చి ఫాదర్లు ఆశీర్వచనం చేశారు. పాస్టర్లు విల్సన్, దయాకర్, సుధీర్, కృపానంద్, బీఆర్ఎస్డివిజన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి ఉన్నారు.
సేవాలాల్విగ్రహ ప్రతిష్ట
అమీర్ పేట బాపూ నగర్ లో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. పూజలు, హోమంలో మంత్రి పాల్గొనగా నిర్వాహకులు సన్మానించారు.