
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గడువు దగ్గర పడుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గురువారం ఒక్క రోజే 10 వేల దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 25 వేలు దాటింది.
అప్లికేషన్లకు శనివారం వరకు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోయినేడాది కూడా ఇదే తరహాలో చివరి రెండు రోజుల్లోనే 60 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో, ఈసారి కూడా చివరి నిమిషంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.