
వచ్చే సంవత్సరం (2026) జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్లతో పాటు అంగ ప్రదక్షిణ టోకెన్లను టీటీడీ ఆదివారం ( అక్టోబర్ 19) ఉదయం 10గంటలకు ఆన్ లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలం కార సేవ టికెట్లను విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చు వల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను జారీ చేస్తారు.
అక్టోబర్ 24 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృ ద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 25 ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను జారీ చేస్తారు.