కృష్ణా జిల్లా పెనమలూరును చుట్టుముట్టిన ఆక్టోపస్ బలగాలు : ఓ ఇంట్లో మావో సానుభూతిపరులు

కృష్ణా జిల్లా పెనమలూరును చుట్టుముట్టిన ఆక్టోపస్ బలగాలు : ఓ ఇంట్లో మావో సానుభూతిపరులు

కృష్ణా జిల్లా పెనమలూరులో హైటెన్షన్ నెలకొంది.. పెనమలూరులోని కొత్త ఆటోనగర్ లో ఆక్టోపస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. కొత్త ఆటోనగర్ లో 25 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్టు అనుమానంతో మంగళవారం ( నవంబర్ 18 ) తనిఖీలు చెప్పుతారు అధికారులు. ఈ క్రమంలో కొత్త ఆటో నగర్ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు అధికారులు. రెండు గంటలుగా భారీగా సోదాలు చేపట్టారు అధికారులు. మహిళా మావోయిస్టులా లేక తీవ్రవాద సానుభూతి పరులా అనే కోణంలో సోదాలు చేస్తున్నారు అధికారులు.

మావోయిస్టు సానుభూతి పరులు ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్ లో నివాసం ఉంటున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. కొత్త ఆటో నగర్ లోని ఓ భవనాన్ని షెల్టర్ గా మార్చుకున్నట్లు సమాచారం అందడంతో ఇవాళ సోదాలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో భవనాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు పోలీసులు. అనుమానితులను ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఆయుధాల డంప్ గురించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇదిలా ఉండగా.. అల్లూరి జిల్లా మారేడుమిల్లీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోయాడు. అతని భార్య హేమ కూడా ఈ ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మాతో పాటు మొత్తం ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మాను లొంగిపోవాల్సిందిగా కోరిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే అంటే.. నవంబర్ 11 న హిడ్మా ఇంటికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్ శర్మ సందర్శించారు. 

హిడ్మా తల్లి యోగక్షేమాలు అడిగి.. ఆమెతో కలిసి భోజనం చేశారు. హిడ్మా లొంగిపోయేలా నచ్చజెప్పాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహిత భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

దీంతో హిడ్మా నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయ్ బిడ్డా అని ఆ తల్లి భావోద్వేగంతో వేడుకుంది. ఏ తల్లి అయినా తన కుమారుడు క్షేమం కోరుకుంటుంది. అదే విధంగా తన కొడుకును ఎక్కడ ఎన్ కౌంటర్ చేస్తారోనని.. ఇంటికి వచ్చేయ్ బిడ్డా అంటూ వేడుకుంది. నీవు ఎక్కడున్నా వెతికేందుకు అడవుల్లోకి వస్తాను.. చివరి రోజుల్లో ఈ అమ్మకు తోడుండు కొడుకా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కొడుకు వస్తే కళ్లారా చూసుకోవాలని ఆశపడింది. కానీ ఆమె ఆశ తీరలేదు.. కన్నపేగును తడిమాలనుకున్న ఆమె కోరిక నెరవేరలేదు.. వారం తిరిగే లోపే ఆమె కొడుకు హిడ్మా ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు.