ODI World Cup 2023: భారత జట్టును వెంటాడుతున్న వర్షం.. వరుసగా రెండో మ్యాచ్ రద్దు

ODI World Cup 2023: భారత జట్టును వెంటాడుతున్న వర్షం.. వరుసగా రెండో మ్యాచ్ రద్దు

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును వర్షం నీడలా వెంటాడుతోంది. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. నేనొస్తా అంటూ ఆట ప్రారంభం కాకముందే అక్కడ ప్రత్యక్షమవుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మొదటి వామప్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు(మంగళవారం) తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్‌‌తో జరగాల్సిన రెండో వామప్‌ మ్యాచ్‌ కూడా వర్షం ధాటికి రద్దయ్యింది. 

ALSO READ: రైనా పగ చల్లారినట్లే..!: గిల్ రికార్డ్ బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్

టాస్ పడకముందే వచ్చేశాడు

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మొదటి వామప్ మ్యాచ్‌‌లో టాస్ పడ్డాక ఎంట్రీ ఇచ్చిన వరుణుడు.. ఈ మ్యాచ్‌లో ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచే అక్కడ తిష్టవేశాడు. చినుకులతో ప్రారంభమైన వాన.. కాసేపట్లోనే మైదానాన్ని ముంచెత్తింది. ఆపై ఎడతెరిపి లేకుండా దంచికొట్టడంతో అంపైర్లకు మరోదారి కనిపించలేదు. దీంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోప్రత్యర్థి జట్లతో ప్రాక్టీస్ లేకుండానే టీమిండియా ప్రధాన మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.