ODI World Cup 2023: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మరో హైవోల్టేజ్ మ్యాచ్.. ఆఫ్ఘన్లతో తలపడనున్న పాకిస్తాన్

ODI World Cup 2023: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మరో హైవోల్టేజ్ మ్యాచ్.. ఆఫ్ఘన్లతో తలపడనున్న పాకిస్తాన్

చెన్నై: రెండు వరుస పరాజయాలతో జోష్‌‌‌‌ తగ్గిన పాకిస్తాన్‌‌‌‌.. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం జరిగే లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌తో తలపడనుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో 4 పాయింట్లతో ఉన్న పాక్‌‌‌‌కు ఈ మ్యాచ్‌‌‌‌ గెలవడం తప్పనిసరి. లేకపోతే సెమీస్‌‌‌‌ చేరే అవకాశాలు మరింత క్లిష్టమవుతాయి. దీనికి తోడు రన్‌‌‌‌రేట్‌‌‌‌ కూడా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. 

గత మ్యాచ్‌‌‌‌ల్లో స్పిన్‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన పాక్‌‌‌‌ బ్యాటర్లకు మరోసారి అఫ్గాన్‌‌‌‌ స్పిన్‌‌‌‌ త్రయం రషీద్‌‌‌‌, ముజీబ్‌‌‌‌, నబీ నుంచి ముప్పు పొంచి ఉంది. అత్యుత్తమ ఫామ్‌‌‌‌లో ఉన్న ఈ ముగ్గురిని దీటుగా ఎదుర్కొవాలంటే టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ బృందం మరింత నిలకడగా రాణించాల్సి ఉంటుంది. రిజ్వాన్‌‌‌‌తో పాటు సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. పేసర్లలో షాహిన్‌‌‌‌, హారిస్‌‌‌‌, హసన్‌‌‌‌ అలీ మరోసారి సత్తా చాటితే ఇబ్బంది ఉండదు. ఇక ఇంగ్లండ్‌‌‌‌పై సంచలన విజయం సాధించిన అఫ్గాన్‌‌‌‌ మరో విజయంపై దృష్టి పెట్టింది. రహమానుల్లా గుర్బాజ్‌‌‌‌, ఇక్రమ్‌‌‌‌ అలీఖిల్‌‌‌‌, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌, హష్మతుల్లా షాహిదిపై బ్యాటింగ్‌‌‌‌ భారం ఆధారపడి ఉంది. బౌలింగ్‌‌‌‌లో పేసర్ల కంటే స్పిన్నర్ల బలమే అఫ్గాన్‌‌‌‌కు ప్రధాన ఆయుధం.