హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందడి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందడి

హైదరాబాద్, వెలుగు : వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సందడి చేసింది. సిటీలో రెండు రోజుల టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గురువారం ఉదయం ప్రఖ్యాత కట్టడం చార్మినార్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచారు. సాయంత్రం హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకెళ్లారు. ఉప్పల్ స్టేడియంలో ట్రోఫీ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కాగా వరల్డ్ కప్ కోసం ఉప్పల్ స్టేడియం రెనోవేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య  కమిటీ మెంబర్​ జస్టిస్ లావు నాగేశ్వరరావుకు సాయంగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్, సీఈవో సునీల్ కాంటే తెలిపారు. సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాలివానకు ధ్వంసమైన కనోపి (పైకప్పు) పనులు పూర్తయ్యాయన్నారు.

ఈస్ట్ స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా పైకప్పు ఏర్పాటు పనులు చివరి దశకు వచ్చాయన్నారు. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత వెస్ట్ స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనోపి పనులు జరుగుతాయన్నారు. స్టేడియంలో దాదాపు సగం వరకు కొత్త సీట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇక హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికలు వచ్చే నెల చివరి లోపు పూర్తవుతాయని దుర్గా ప్రసాద్ తెలిపారు.